(Local) Wed, 28 Jul, 2021

హాంకాంగ్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు

November 12, 2019,   3:30 PM IST
Share on:
హాంకాంగ్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు

హాంకాంగ్‌లో సంపూర్ణ ప్రజాస్వామ్యం కోసం ఐదు నెలలుగా ఇక్కడి ప్రజలు సాగిస్తున్న ఉద్యమం హింసాత్మకంగా మారింది. సోమవారం కొందరు ఆందోళనకారులు రైలు పట్టాలు, రహదారులను దిగ్బంధించగా, పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. శుక్రవారం పోలీసుల దాడుల్లో గాయపడ్డ ఓ విద్యార్థి మృతిచెందడంతో సోమవారం ఆందోళనలు మిన్నంటాయి.  మా ఆన్‌ షాన్‌ పట్టణంలో ఓ ఆందోళనకారుడిపై కొందరు వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.