(Local) Wed, 20 Oct, 2021

పోలవరం హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

November 01, 2019,   10:30 AM IST
Share on:
పోలవరం హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి హైకోర్టు గ్రీ ...

పోలవరం హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు చేస్తున్న నవయుగ సంస్థ తమ కాంట్రాక్టును సర్కార్ రద్దు చేయడంతో హైకోర్టుకు వెళ్లింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ పై ముందుగా హైకోర్టు స్టే విధించింది. తాజాగా గురువారం దీని పై విచారించిన కోర్టు స్టే ఎత్తివేసి కొత్త కాంట్రాక్టర్ తో ఒప్పందం చేసుకోవచ్చని ఆదేశించింది. ఇటీవలే పోలవరంపై సీఎం జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రూ. 850 కోట్లు ఆదా అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. నవయుగ సదుద్దేశంతో పిటిషన్ వేయలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్బిట్రేషన్ తర్వాత పిటిషన్ వేయడంలో అర్థం లేదన్న ఏజీ వాదనతో ఏకీభవించింది. దీంతో ఇప్పుడు హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి కొత్త ఒప్పందానికి మార్గం సుగమం అయ్యింది. సీఎం జగన్ ఖాతాలో మరో విజయం వరించిందని వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.