(Local) Sun, 20 Jun, 2021

బీజేపీ అభ్యర్థిని కాలితో తన్నిన కార్యకర్తలు

November 26, 2019,   11:22 AM IST
Share on:
బీజేపీ అభ్యర్థిని కాలితో తన్నిన కార్యకర్తలు

పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. కరీంపూర్ లో నిన్న  ఉప ఎన్నిక జరుగుతుండగా ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ అభ్యర్థి జయప్రకాశ్ మజుందార్ పై దాడి చేశారు. దారి మధ్యలో వాహనాన్ని ఆపి దాడికి దిగారు. కాలితో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దుతూ పక్కనున్న గుంతలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా జయప్రకాశ్ మజుందార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల ఆగడాలు మితిమీరి పోతున్నాయన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. నాకు తలిగిన గాయాలు మానిపోవచ్చు కానీ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని రుజువైందని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్.. జయప్రకాశ్ పై దాడికి పాల్పడింది తమ కార్యకర్తలు కాదని.. బీజేపీ కార్యకర్తలే కొట్టారని తెలిపింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.