(Local) Sat, 27 Feb, 2021

మల్లన్న సాగర్ భూముల వ్యవహారంపై హై కోర్ట్ తీర్పు

August 20, 2019,   1:25 PM IST
Share on:
మల్లన్న సాగర్ భూముల వ్యవహారంపై హై కోర్ట్ తీర్పు

మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులకు హైకోర్టు 2 నెలల జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చినప్పటికి కూడా పరిహారం చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఇందులో ప్రధాన అధికారులైన సిద్దిపేట జిల్లా తొగుట ఆర్డీవో విజయేందర్, ఎమ్మార్వో ప్రభులకు హైకోర్టు 2 నెలల జైలు శిక్ష, 2 వేల జరిమానా విధించడంతో పాటు వారిని సస్పెన్షన్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  

మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని బాధితులు కోర్టును ఆశ్రయించారు. వారికి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కానీ కోర్టు ఆదేశాలను రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయడం లేదని మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు అధికారులకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.