(Local) Fri, 22 Oct, 2021

పోలవరం టెండర్లపై హై కోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు

August 22, 2019,   2:49 PM IST
Share on:
పోలవరం టెండర్లపై హై కోర్టులో ప్రభుత్వానికి చుక్కెద ...

ఏపి హైకోర్టులో జగన్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు కొద్దిసేపటి క్రితం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై గుత్తేదారు సంస్థ నవయుగ, సోమవారం నాడు కోర్టును ఆశ్రయించగా, మూడు రోజుల పాటు విచారించిన బెంచ్, ఈ మేరకు స్టే ఇస్తూ, ఆదేశాలు జారీ చేసింది. రివర్స్ టెండరింగ్ పై ముందుకు వెళ్లవద్దని, పూర్తి వివరాలతో తమకు నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులు పంపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. దీంతో పోలవరం పనులు నవయుగ సంస్థే కొనసాగించే అవకాశముంది.

సంబంధిత వర్గం
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.