(Local) Thu, 21 Nov, 2019

తెలంగాణలో నేడు,రేపు వర్షాలు

August 23, 2019,   4:11 PM IST
Share on:
తెలంగాణలో నేడు,రేపు  వర్షాలు

తెలంగాణలో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య మధ్యప్రదేశ్ ఆనుకొని ఉన్న దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా 3.1 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో 1.5 కి.మీల నుంచి 4.5 కి.మీల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ రోజు(శుక్రవారం), రేపు(శనివారం) ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలోనూ రాగల మూడురోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని… రెండు, మూడు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత వర్గం
ప్రైవేటైజేషన్‌పై విచారణ నేటికి వాయిదా...
ప్రైవేటైజేషన్‌పై విచారణ నేటికి వాయిదా...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.