(Local) Sun, 17 Jan, 2021

నేటి నుంచి సీమలో భారీ వర్ష సూచన : ఆర్టీజీఎస్

September 21, 2019,   3:34 PM IST
Share on:
నేటి నుంచి సీమలో భారీ వర్ష సూచన : ఆర్టీజీఎస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను వర్షాలు అతలాకులతం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాలకు ఆర్టీజీఎస్‌ భారీ వర్ష సూచన చేసింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలులోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ పేర్కొంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపింది. పశ్చిమ, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. వర్షాల వల్ల రాయలసీమలో వాగులు, వంకలు పొంగిపొర్లుతాయని అధికారులు పేర్కొన్నారు. రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్‌ సూచించింది.

సంబంధిత వర్గం
త‌మిళ‌నాడులో భారీ వర్షాలు
త‌మిళ‌నాడులో భారీ వర్షాలు
రాయలసీమలో భారీ వర్షాలు
రాయలసీమలో భారీ వర్షాలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.