(Local) Wed, 20 Oct, 2021

శాస్త్రవేత్తలారా మీ వెనుక మేమున్నాం: ప్రధాని మోదీ

September 07, 2019,   10:50 AM IST
Share on:
శాస్త్రవేత్తలారా మీ వెనుక మేమున్నాం: ప్రధాని మోదీ

శనివారం ఉదయం 8 గంటలకు బెంగుళూరులోని ఇస్రో కేంద్రం నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. చంద్రయాన్-2 కొద్దిలో చేజారిందని, దాని పై ఆవేదన చెందవద్దని ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు, ప్రజలకు దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఏం మాట్లాడుతూ...
“భారత్ మాతాకీ జై. చంద్రయాన్ 2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారు. మీ ఆవేదనను నేను అర్ధం చేసుకోగలను. మీ యొక్క కష్టం దేశం అంతటికి తెలుసు. ఈ అడ్డంకులు మన బలాన్ని మరింత బలోపేతం చేస్తాయి. శాస్త్రవేత్తలు జాతి గర్వించేలా జీవితాలను త్యాగం చేశారు. శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగానికి గర్వపడుతున్నాం. శాస్త్రవేత్తల మానసిక పరిస్థితి అర్థం చేసుకోగలను. మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. మీ కృషి ఎప్పటికి వృథా కాదు. దేశం మీ వెంటే ఉంటుంది. భవిష్యత్తులో మీరు మరిన్ని ప్రయోగాలు చేయాలి. మీరు సంతోషించే మరెన్నో అవకాశాలు మున్ముందు వస్తాయి. ఇస్రో ఎన్నో ఆటంకాలను అధిగమించింది. ప్రతి సమస్య మనకు కొత్త విషయాలను నేర్పుతుంది. ప్రతి ప్రయత్నం కొత్త విషయాన్ని తెలియజేస్తుంది. మీరెంత కష్టపడ్డారో మీ కళ్లే చెబుతున్నాయి. మీ కుటుంబ సభ్యులకు నా సెల్యూట్. ఈ రోజు మనకు ఎదురైన పాఠాలు మనల్ని మరింత బలంగా తీర్చిదిద్దుతాయి. మీరు అదైర్య పడవద్దు. చందమామ దగ్గరికి వెళ్లాం. ఇది శాస్త్రవేత్తల పనితీరుకు నిదర్శనం. త్వరలోనే దానిని కూడా అధిగమించే రోజు వస్తుంది. మీరు ఎవరు కూడా కంగారు పడవద్దు. తదుపరి ప్రయోగాల పై దృష్టిపెట్టాలి. మీకు సంఘీభావంగా రాత్రి దేశమంతా మేల్కొని ఉంది. మీ వెనుక మేము ఉన్నాం. దేశమంతా ఉంది." అంటూ ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు భరోసానిచ్చారు.

సంబంధిత వర్గం
ఇస్రో పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం సక్సెస్
ఇస్రో పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం సక్సెస్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.