(Local) Wed, 20 Oct, 2021

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు...

September 23, 2019,   3:47 PM IST
Share on:
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు...

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ చీరల పంపిణీ లాంఛనంగా ప్రారంభమైంది. మంత్రులు ఈ కార్యక్రమాన్ని సోమవారం అన్ని జిల్లాల్లో ప్రారంభించారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళలకు కానుకలు ఇస్తున్నామని చెప్పారు. మళ్లీ బతుకమ్మ పండుగ నాటికి జిల్లా ఆడపడుచులందరితో కలిసి కాళేశ్వరం నీళ్లతో బతుకమ్మ చేసుకుంటామని హరీష్ రావు అన్నారు.కాగా గతానికి భిన్నంగా ఈసారి ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ కానుకలను అందిస్తోంది. చేనేత కార్మికులకు చేయూతను ఇస్తూ, మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నారు. చేనేత మగ్గాలపై నేసిన 100 రకాల చీరలను పంపిణీ చేస్తున్నారు. మొత్తం కోటి మంది లబ్ధిదారులకు వీటిని చేరవేయన్నారు. ప్రతి ఆడపడుచు పండగ రోజు కొత్తచీర కట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసారి చీరలను అందుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తామంతా పుట్టింటి చీరగా దీన్ని భావిస్తామని అంటున్నారు. బతుకమ్మ పండగకు ముందుగానే చీరలను తమకు అందజేసిన ప్రభుత్వానికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.