(Local) Mon, 09 Dec, 2019

ఉచితంగా హాల్ టిక్కెట్ల డౌన్లోడ్ సదుపాయం

August 28, 2019,   12:15 PM IST
Share on:
ఉచితంగా హాల్ టిక్కెట్ల డౌన్లోడ్ సదుపాయం

సచివాలయ పోస్టుల కోసం 1వ తేదీ నుంచి జరుగనున్న అర్హత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు హాల్‌ టికెట్లు పొందేందుకు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ఉచిత వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలోని ఎంపీడీవో పర్యవేక్షణలో వున్న ఉపాధి హామీకి చెందిన మండల కంప్యూటర్‌ కేంద్రాల్లో (ఎంసీసీలు) అభ్యర్థులు ఉచితంగా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం. గిరిజా శంకర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.  అభ్యర్థుల్లో చాలా భాగం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారైనందువల్ల ఇంటర్నెట్‌ సౌకర్యం బలహీనంగా వుంటుందని, అలాంటి వారు నేరుగా మండల కేంద్రాల్లో ఎంసీసీ కార్యాలయాల్లోని కంప్యూటర్‌ ఆపరేటర్‌ను సంప్రదించి వ్యక్తిగత గుర్తింపు కార్డు అందజేస్తే ఉచితంగా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసి అందజేయాలని కమిషనర్‌ వుత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఈ ఉత్తర్వులు పంపారు.

సంబంధిత వర్గం
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.