(Local) Tue, 20 Oct, 2020

హెచ్‌ఏఎల్‌లో మోగనున్న సమ్మె సైరను

October 05, 2019,   2:56 PM IST
Share on:
హెచ్‌ఏఎల్‌లో మోగనున్న సమ్మె సైరను

వేతనాలు పెంచాలని కోరుతూ బెంగళూరులోని హిందూస్తాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయంతో పాటు దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో ఉన్నశాఖల వద్ద కార్మికులు ఈ నెల 14 నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ 2017 జనవరి 1 నుంచి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నా యాజమాన్యం స్పందించలేదని చెబుతున్నారు. సంస్థలో 2007లో ఒకసారి, 2012లో మరోదఫా జీతాలు పెంచారు. అనంతరం వేతన సవరణ లేకపోవడంతో యాజమాన్య ప్రతినిధులతో పలు దఫాలు చర్చలు జరిపామని, ఫలితం లేకపోవడంతో సమ్మె అనివార్యమైందని అఖిలభారత హెచ్‌ఏఎల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కో-ఆర్జినేషన్‌ కమిటీ ప్రకటించింది.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.