(Local) Thu, 24 Sep, 2020

టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ మాజీ ఎంపీ

August 03, 2019,   12:34 PM IST
Share on:
టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ మాజీ ...

తెలంగాణ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని సీఎం కేసీఆర్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో సీఎంను కలిసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గుత్తా నామినేషన్ పత్రాల దాఖలు ప్రక్రియలో సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి సీఎం ఆదేశించారు.

 

నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడమే కాదు పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. జిల్లా రాజకీయాలపై మంచిపట్టుంది. అంతేగాదు సీఎం కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయన్ని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా సైతం నియమించారు సీఎం.

ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానం ఖాళీ అయింది. ఇక ఈ నెల 7న నోటిఫికేషన్‌ జారీ చేయనుండగా అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 14. నామినేషన్‌ పత్రాలను 16న పరిశీలిస్తారు. ఉపసంహరణకు 19వ తేదీ వరకు గడువిచ్చారు. ఎన్నికలు అవసరమైతే 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరుగుతుంది. అసెంబ్లీలో మెజార్టీ బలం ఉండటంతో గుత్తా ఎన్నిక లాంఛనమే కానుంది.

సంబంధిత వర్గం
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన  కేటీఆర ...
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.