(Local) Fri, 26 Feb, 2021

న్యాయమూర్తుల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

August 02, 2019,   11:18 AM IST
Share on:
న్యాయమూర్తుల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమో ...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుప్రీంకోర్టులో పెరిగిపోతున్న పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించేందుకు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి కాకుండా 30 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇకపై న్యాయమూర్తుల సంఖ్యను 33కి పెంచాలన్న ప్రతిపాదనకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో ప్రధాన న్యాయమూర్తితో కలిసి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరగనుంది. త్వరలో దీనిపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు.

సంబంధిత వర్గం
తొలి సమావేశానికి డుమ్మా కొట్టిన అజిత్ పవార్
తొలి సమావేశానికి డుమ్మా కొట్టిన అజిత్ పవార్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.