(Local) Wed, 20 Oct, 2021

‘గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్’ అవార్డును పొందిన మోడీ

September 25, 2019,   4:28 PM IST
Share on:
‘గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్’ అవార్డును పొందిన మోడ ...

అమెరికా పర్యటనలో ఉన్న మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గుర్తింపుగా ‘గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్’ అవార్డును అందుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మోదీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రారంభించిన గోల్ కీపర్స్ అవార్డు పేదరికాన్ని అంతం చేయడానికి కృషిచేస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులకు అందిస్తారు. ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్ములించడానికి కృషి చేస్తున్న నాయకులను ఒకేచోట చేర్చడానికి ప్రయత్నిస్తోందని బిల్ గేట్స్ అన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ సహా పలువురు హాజరయ్యారు.

సంబంధిత వర్గం
ఇందిరమ్మ జయంతి...నివాళులర్పిస్తున్న ప్రముఖులు
ఇందిరమ్మ జయంతి...నివాళులర్పిస్తున్న ప్రముఖులు
ప్రధాని మోడీకి కితాబిచ్చిన న్యూయార్క్ మాజీ మేయర్!
ప్రధాని మోడీకి కితాబిచ్చిన న్యూయార్క్ మాజీ మేయర్!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.