(Local) Mon, 12 Apr, 2021

ప్రధాని మోడీకి కితాబిచ్చిన న్యూయార్క్ మాజీ మేయర్!

September 20, 2019,   11:22 AM IST
Share on:
ప్రధాని మోడీకి కితాబిచ్చిన న్యూయార్క్ మాజీ మేయర్!

న్యూయార్క్ మాజీ మేయర్ మైక్ బ్లూమ్ బర్గ్ ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. భారత ప్రభుత్వం ఈ-సిగరెట్లపై నిషేధం విధించిన నేపథ్యంలో ఈ-సిగరెట్ల నిషేధం విషయంలో ప్రధాని మోదీ తీసుకున్న చొరవపై న్యూయార్క్ కు 3 సార్లు మేయర్ గా పనిచేసిన మైక్ బ్లూమ్ బర్గ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ-సిగరెట్లపై నిషేధం విధించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఈ-సిగరెట్లు అనే ప్రమాదకరమైన అంటువ్యాధిని ముందే గుర్తించిన మోడీ భారత ప్రజల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇచ్చారని కితాబిచ్చారు. అమెరికాలోని న్యూయార్క్, మిషిగన్ రాష్ట్రాలు ఇప్పటికే ఈ-సిగరెట్ల వాడకం, అమ్మకం, తయారీ, ఎగుమతి-దిగుమతిపై నిషేధం విధించాయి.

సంబంధిత వర్గం
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.