(Local) Tue, 02 Mar, 2021

ఉగ్రవాదులకు ఆర్థిక సాయం.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

August 10, 2019,   5:43 PM IST
Share on:
ఉగ్రవాదులకు ఆర్థిక సాయం.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో భద్రతా బలగాలు ఉగ్రవాదులు.. వారికి సాయం చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నాయి. పలు ప్రాంతాల్లో సానుభూతిపరులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆర్థిక సాయం,సెల్టర్లు ఏర్పాటు చేసిన వారి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే రషీద్ ఇంజినీర్‌ను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ రోజు ఆయన్ను ఢిల్లీ పటియాలా కోర్టు లో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం ఈ నెల 14 వరకు కస్టడీలోకి తీసుకొమ్మని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వర్గం
రైల్వేను ప్రైవేటీకరించం: రాజ్యసభలో పీయూష్ గోయల్
రైల్వేను ప్రైవేటీకరించం: రాజ్యసభలో పీయూష్ గోయల్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.