(Local) Mon, 17 Jun, 2019

ప్రారంభమైన ఏపీ మంత్రివర్గం తొలి సమావేశం

June 10, 2019,   1:13 PM IST
Share on:

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నూతనంగా విస్తరించిన ఏపీ మంత్రివర్గం తొలి సమావేశం ప్రారంభమైంది .సోమవారం ఉదయం 10 . 30 గంటలకు సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల మంత్రివర్గ సమావేశం మందిరంలో సమావేశం జరుగుతోంది .తొలి కేబినెట్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది .
రైతులు , మహిళలు , అవ్వా తాతలు , వికలాంగులు , ఉద్యోగులు , కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు .ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఎనిమిది అంశాలతో కేబినెట్ అజెండాను రూపొందించారు .అలాగే అక్టోబర్ 15 నుంచి అమలు చేయనున్న వైఎస్సార్ రైతు భరోసా పథకంపై చర్చించనున్నారు .
గత వారం రోజులుగా జరుగుతున్న వివిధ శాఖల అధికారిక సమీక్ష సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన పలు సంకేతాలను వైఎస్ జగన్ ఇచ్చారు .

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.