(Local) Sat, 30 May, 2020

బలమైన దేశం కోసం… బలమైన పౌరుడు -నిర్మలా సీతారామన్

July 05, 2019,   1:30 PM IST
Share on:
బలమైన దేశం కోసం… బలమైన పౌరుడు -నిర్మలా సీతారామన్

నవ భారత అనే విధానం కోసం తాము కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు  పార్లమెంట్ ఎన్నికలలో పని చేసే ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఆహార భద్రతపై ఖర్చును రెట్టింపు చేశామని, ఐదు సంవత్సరాలు కష్టపడినందుకు 2017-18లో పేటెంట్ల జారీ సంఖ్య మూడు రెట్లు పెరిగిందని, దేశంలో ప్రతీ ఒక్కరూ మార్పు చూడగలిగేలా చేశామని, బలమైన దేశం కోసం… బలమైన పౌరుడు విధానంతో ముందుకెళ్తామని వివరించారు.లక్ష్య సాధనలో నమ్మకం ఉంటే ఏదో ఒక మార్గం దొరుకుతుందని, బలమైన గాలులు వీచినా దీపం వెలుగుతుంటుందని తెలిపారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లుగా ఉందని, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలను నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నామని సీతారామన్  ధీమా వ్యక్తం చేశారు. భారత దేశ చరిత్రలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న తొలి మహిళ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. బ్లూ ఎకానమీ అన్నది మా విజన్‌లో భాగమని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సద్వినియోగం చేసుకుంటామని హామీ ఇచ్చారు. దశాబ్ద లక్ష్యాలను తాము అందుకుంటామని, కొనుగోలు శక్తి పరంగా భారత్ మూడోవ స్థానంలో ఉందని, సంస్థాగత సంస్కరణలు భారీగా తీసుకరావాలని సూచించారు. 

జిఎస్‌టి నమోదిత సంస్థలకు వడ్డీలో సబ్సిడీ ఇస్తామని, ఎంఎస్‌ఎంఇ చెల్లింపులకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని, ఆదర్శ అద్దె విధానాన్ని త్వరలోనే తీసుకొస్తామని, అందుబాటు ధరల్లో ఇళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని,  మీడియా, ఏవియోషన్ రంగాల్లో ఎఫ్‌డిఐలకు అనుమతి ఇస్తామని, ఇస్రో సామర్ద్యాన్ని వినియోగించుకునేందుకు కొత్త కంపెనీ ఏర్పాటు చేస్తామని, ఉజ్వల యోజన, సౌభాగ్యం యోజనతో జీవితాలు మారిపోయాయని తెలిపారు. ఏడు కోట్ల కుటుంబాలకు ఎల్‌పిడి సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు.అంతర్గత నదీ జల రవాణాను అభివృద్ధి చేసి రవాణాకు వినియోగిస్తామని, గంగానదీలో ప్రస్తుతం చేస్తున్న జలరవాణాను నాలుగింతలు పెంచుతామని, రైల్వేల అభివృద్ధికి 50 లక్షల కోట్ల నిధులు అవసరమని తెలియజేశారు. ఇక దేశ వ్యాప్తంగా అన్ని ప్రజా రవాణాల్లో ప్రయాణానికి ఒకే కార్డు ఉంటుందని, ఒకే కార్డుతో బస్సు, రైలు, విమానం, మెట్రోల్లో ప్రయాణం చేసే సౌలభ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒకే గ్రిడ్ కిందికి అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి సరఫరా చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు తక్కువ ధరకు గృహ సదుపాయం కల్పిస్తామని, గ్రామాలను పట్టణాలతో అనుసంధానం చేయడానికి భారత్ మాల పథకం తీసుకోస్తామని, అద్దెకుండే వారి హక్కుల పరిరక్షణకు కొత్త చట్టం తీసుకోస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. ప్రధాని కర్మ యోగి పథకం ప్రారంభిస్తామని, ఆధార్ కార్డుతో చేరే వీలు కల్పిస్తాం, పల్లెలు, పేదలు, రైతులపై ప్రత్యేక దృష్టి పెడుతామన్నారు.

సామాన్యుడి స్థితిగతులు మార్చేందుకు అనేక పథకాలు చేపట్టామని, మౌలిక రంగంలో భారీగా పెటుబడులకు పెట్టాలని, పెట్టుబడి లేకుండా వ్యవసాయం పథకం రూపొందించామని, ఇప్పటికే రైతులకు శిక్షణ ఇస్తున్నామని, పేదలకు ఇల్లు నిర్మించే గడువును 114 రోజులకు తగ్గించామన్నారు. భారత్ మాలతో దేశంలో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని, సాగర్‌మాల ప్రాజెక్టుతో రేవుల వ్యవస్థ మెరుగుపడుతుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2018-19లో 300 కిలో మీటర్ల మెట్రో మార్గానికి ఆమోదం తెలిపామని, 657 కిలో మీటర్ల మెట్రో రైలు వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు.

 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.