(Local) Sat, 30 May, 2020

నవభారతావని కోసం ప్రజలు తీర్పునిచ్చారు - నిర్మలా సీతారామన్

July 05, 2019,   11:42 AM IST
Share on:
నవభారతావని కోసం ప్రజలు తీర్పునిచ్చారు - నిర్మలా సీ ...

కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2019-20 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఆమె ఏమన్నారంటే... “నవభారతావని కోసం ప్రజలు తీర్పునిచ్చారు. దేశ వ్యాప్తంగా ప్రజలు మోదీకి మద్దతునిచ్చారు. జాతీయ భద్రత, ఆర్ధిక ప్రగతే మా లక్ష్యం. సంస్కరణలు, పని చేయడం ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాం. ప్రతి మూలకు, ప్రతి మనిషికి పథకాలు చేరడమే మా లక్ష్యం. బలమైన లక్ష్యం ఉంటే అనుకున్నది సాధించవచ్చు. 5 ట్రిలియన్ల డాలర్ల వ్యవస్థే మా లక్ష్యం. ఆహార భద్రతకు వ్యయాన్ని రెట్టింపు చేశాం. అట్టడుగు వర్గాల వారికి సేవ చేయడమే మా లక్ష్యం. ఈ ఏడాది 3 ట్రిలియన్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ కానుంది. ప్రపంచంలోనే మనది అతి పెద్ద ఆరో ఆర్ధిక వ్యవస్థ. శక్తి వంతమైన దేశం కావాలంటే శక్తి వంతమైన పౌరులు ఉండాలి. అనుకున్న లక్ష్యాలు సాధిస్తామన్న నమ్మకం ఉంది. మౌలిక వసతుల కల్పన కోసం అధిక నిధులు కేటాయిస్తాం.

ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం. ముద్ర సామాన్యుడి జీవితాన్ని మార్చేసింది. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలల్లో ఉద్యోగిత కల్పన మా లక్ష్యం.  మేకిన్ ఇండియాను పారిశ్రామిక వేత్తలు అర్ధం చేసుకున్నారు. ఐదేళ్లలో దేశ ఆర్ధిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. మేకిన్ ఇండియాకు మంచి స్పందన వచ్చింది. రవాణా రంగాన్ని పారిశ్రామిక రంగంతో కనెక్టివిటి చేస్తాం.  రూపే కార్డుతో బహుళ సేవలు చేసే అవకాశం వచ్చింది. రైల్వేలకు ఏటా లక్షన్నర కోట్ల అవసరం. ప్రస్తుతం రైల్వే రంగంలో 13 లక్షల మంది పని చేస్తున్నారు. 2018-19 లో 300 కిలోమీటర్ల మెట్రో రైళ్ల నిర్మాణానికి అనుమతిచ్చాం.

దేశంలో ఇప్పటివరకు 657 కిలోమీటర్ల మెట్రో రైళ్ల నిర్మాణం పూర్తయ్యింది. చైనా, అమెరికా తర్వాత మన ఆర్ధిక వ్యవస్థే పెద్దది. మేం తెచ్చిన పథకాలు సామాన్యునికి మేలు చేశాయి. ఎలక్ట్రిక్ బ్యాటరీలలో రాయితీలు కల్పించాం. ఇండస్ట్రీయల్ కారిడార్లలో మౌలిక వసతులు కల్పించాం.” అని అన్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.