(Local) Wed, 24 Jul, 2019

మారిన బడ్జెట్ బ్రీఫ్ కేస్‌

July 05, 2019,   11:16 AM IST
Share on:

మరి కాసేపట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దేశ చరిత్రలోనే ఆర్ధిక మంత్రిగా తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న మహిళ నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ కొద్ది సేపటి క్రితం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు బడ్జెట్ పత్రాలను అందజేశారు. ఈ సారి బడ్జెట్ బ్రీఫ్ కేసు మారింది. ఎర్రటి వస్త్రంతో చుట్టిన పార్సిల్ లాంటి దాంట్లో బడ్జెట్ పత్రాలు ఉన్నాయి. దానిపై మూడు సింహాల రాజముద్ర ఉంది. ఈ విధంగా ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయానికి నిర్మాలా సీతారామన్ తెరదించారు. ఈ విధంగా మార్పులు చేర్పులతో బడ్జెట్ పై నిర్మల ముద్ర అధికంగా ఉందని అంతా చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.