(Local) Mon, 30 Nov, 2020

44 ఏళ్ల నాటి యుద్ధ విమానాలను ఉపయోగించలేం - బీఎస్‌ ధనోవా

August 21, 2019,   1:18 PM IST
Share on:
44 ఏళ్ల నాటి యుద్ధ విమానాలను ఉపయోగించలేం - బీఎస్‌  ...

44 ఏళ్ల నాటి యుద్ధ విమానాలను ఉపయోగించలేమని  భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) అధిపతి, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా తెలిపారు . రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ తో   ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధనోవా మిగ్‌-21 యుద్ధ విమానం గురించి  ప్రస్తావిస్తూ, ‘ఈ విమానాన్ని 1973-74లో వాయుసేనలో చేర్చారు. ప్రస్తుతం వీటిలో ఐదో తరం యుద్ధ విమానాలు వచ్చేశాయి. ఆ తర్వాతి తరం విమానాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి.ఈ పాత విమానాలతో మనం విజయం సాధించలేకపోతే దానిని భరించగలమా? యుద్ధం లేనంత మాత్రాన మొత్తం ఆధునిక సాంకేతికత స్వదేశంలో తయారయ్యేంత వరకు మనం వేచి ఉండలేం. రక్షణ వస్తువులను అన్నింటికీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కూడా తెలివైన పని కాదు. దాదాపు 44 ఏళ్ల క్రితం నాటి మిగ్‌-21 ఎంఎఫ్‌ విమానాన్ని నేను ఇంకా నడపగలుగుతున్నాను. కానీ అంత పాత కారును మీరెవ్వరూ ఇప్పుడు నడపడం లేదని నేను కచ్చితంగా చెప్పగలను’ అని ధనోవా అన్నారు. భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమనాన్ని కూల్చినప్పుడు  ఉపయోగించింది కూడా ఈ మిగ్‌-21 విమానాన్నే.

సంబంధిత వర్గం
ఇక కాశ్మీరు పర్యవేక్షణ సులభం -బిపిన్‌ రావత్‌
ఇక కాశ్మీరు పర్యవేక్షణ సులభం -బిపిన్‌ రావత్‌
51 సంవత్సరాల క్రితం భారత వాయుసేన విమాన శకలాలు లభ్య ...
51 సంవత్సరాల క్రితం భారత వాయుసేన విమాన శకలాలు లభ్య ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.