(Local) Wed, 19 Feb, 2020

శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి

November 05, 2019,   10:42 AM IST
Share on:
శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని మౌలానా ఆజాద్ రోడ్డు ప్రాంతంలోని మార్కెట్ వద్ద ఉగ్రవాదులు గ్రనేడ్ విసరడంతో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా గతనెల 28న ఉత్తర కశ్మీర్‌లోని సొపోర్‌లో ఉగ్రవాదుల గ్రనేడ్‌ దాడిలో 19 మంది గాయపడిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో బ్రిటన్‌ ఎంపీల పర్యటనకు ఒకరోజు ముందు సొపోర్‌లోని హోటల్‌ ప్లాజాకు సమీపంలోని బస్టాండ్‌ వద్ద ఉగ్రమూకలు ఈ భీకర దాడికి పాల్పడ్డాయి. పీఓకేలోని ఉగ్ర శిబిరాలను భారత్‌ ధ్వంసం చేస్తుండటంతో దిక్కుతోచని పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని సైన్యం పేర్కొంటోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.