(Local) Sat, 06 Jun, 2020

ఫరూఖ్ అబ్దుల్లా ఎక్కడ ఉన్నారో చెప్పండి -కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు

September 16, 2019,   2:29 PM IST
Share on:
ఫరూఖ్ అబ్దుల్లా ఎక్కడ ఉన్నారో చెప్పండి -కేంద్రాన్న ...

మ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను కోర్టులో హాజరుపరచాలంటూ ఎండిఎంకె నాయకుడు వైకో దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించవలసిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఫరూఖ్ అబ్దుల్లా నిర్బంధంలో ఉన్నారా అంటూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రభుత్వ తరఫు రెండవ సీనియర్ న్యాయాధికారి తుషార్ మెహతాను ప్రశ్నించారు. జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగం నుంచి తనకు ఆదేశాలు రావలసిన అవసరం ఉందని, అప్పుడే దీనిపై తాను సమాధానం ఇవ్వగలనని తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. సెప్టెంబర్ 15న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురై జయంతి ఉత్సవాలలో ఫరూఖ్ అబ్దుల్లా పాల్గొనాల్సి ఉందని, అయితే ఆయన ఆచూకీ తమకు తెలియరాలేదని వైకో తన హెబియస్ కార్పస్ పిటిషన్‌లో ఆరోపించారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.