(Local) Wed, 21 Oct, 2020

మద్దతు ధరపై రైతులకు ఆందోళన వద్దు : మంత్రి నిరంజన్ రెడ్డి

November 13, 2019,   12:41 PM IST
Share on:
మద్దతు ధరపై రైతులకు ఆందోళన వద్దు : మంత్రి నిరంజన్  ...

తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం వనపర్తి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని తీసుకొచ్చే బాధ్యత రైతులదేనని తెలిపారు.
రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని  మద్దతుధరకు కొనుగోలు చేస్తామని వెల్లడించారు. పక్క రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు.  పక్క రాష్ట్రాల ధాన్యాన్ని తీసుకొచ్చే దళారులపై వ్యవసాయం చేస్తున్న రైతు లాభ పడాలన్నదే ప్రభుత్వ ఆశయమని స్పష్టం చేశారు.  పండిన పంటలలో కేంద్రం 25 నుండి 30 శాతమే మద్దతుధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. మార్కెట్ లో  రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షం వస్తే ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  రాబోయే 50 రోజులు మార్కెటింగ్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని,   గ్రామాల వారీగా వేసిన పంటలు, వచ్చిన దిగుబడి వివరాలు వ్యవసాయ, రెవిన్యూ అధికారుల నుండి సేకరించి అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.