(Local) Mon, 12 Apr, 2021

తెలంగాణలో ప్రాణాల మీదకు తెస్తున్న యూరియా కొరత

September 06, 2019,   4:29 PM IST
Share on:
తెలంగాణలో ప్రాణాల మీదకు తెస్తున్న యూరియా కొరత

తెలంగాణలో యూరియా కష్టాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యూరియా కోసం నిలబడిన రైతు మృతిచెందిన సంఘటన మరువక ముందే నిజామాబాద్ జిల్లాలో మరో సంఘటన జరిగింది. ఇందల్వాయి సహకారం సంఘం వద్ద యూరియా కోసం నిలబడిన ఓ మహిళా రైతు స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను రైతులు, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. యూరియా బస్తాల కోసం ఉదయమే వచ్చిన మహిళా రైతు లైన్ లో నిలబడి మంచినీరు కూడా తాగకపోవడంతో స్పహ తప్పి పడిపోయిందనిన స్థానిక రైతులు చెబుతున్నారు.
రాష్ట్రంలో యూరియాపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనకు అధికారులు చెప్పే విషయాలకు పొంతన ఉండటం లేదని రైతులు మండిపడుతున్నారు. అస్సలు యూరియా కొరతే లేదని మంత్రి ప్రకటించి గంటల వ్యవధిలోనే మహిళా స్పృహ తప్పి పడిపోవడం ఏంటని మండిపడుతున్నారు. యూరియా కొరతే లేకుంటే రైతులు ఎందుకు క్యూలైన్ లు కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా స్టాక్ లేదని, కొద్దిగే ఉందని సిబ్బంది చెబుతుండటంతో కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి యూరియా కోసం క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితులు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వర్గం
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన  కేటీఆర ...
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
కేంద్ర మంత్రి నిజామాబాద్ పర్యటనలో ఉద్రిక్తత
కేంద్ర మంత్రి నిజామాబాద్ పర్యటనలో ఉద్రిక్తత

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.