(Local) Thu, 24 Sep, 2020

తెలంగాణ మాజీ ఎంపీకి కీలక పదవి ...ఉత్తర్వులు జారీ!

August 17, 2019,   10:48 AM IST
Share on:
తెలంగాణ మాజీ ఎంపీకి  కీలక పదవి ...ఉత్తర్వులు జారీ!

తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుడి భుజమైన మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ కు కీలక పదవి కట్టబెట్టాడు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించి కేబినేట్ హోదా కల్పించారు.  వినోద్ కు కేబినెట్ హోదాతోపాటు కేబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో వినోద్ కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కరీనంగర్ లోక్ సభ నుంచి పార్లమెంట్ కు తిరిగి పోటీ చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో సీఎం కేసీఆర్ వినోద్ ను ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా నియమించారు.
 

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.