(Local) Mon, 23 Sep, 2019

రాజధాని అంశంపై ప్రభుత్వం తన వైఖరిని చెప్పాలి - ప్రత్తిపాటి

August 26, 2019,   2:25 PM IST
Views: 82
Share on:
రాజధాని అంశంపై ప్రభుత్వం తన వైఖరిని చెప్పాలి -  ప్ ...

ఏపీ రాజధాని అంశంపై  మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... నవ్యాంధ్ర రాజధాని మార్పుపై పజ్రల్లో పలు అనుమానాలు నెలకొంటున్నాయని అన్నారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్‌ నాలుగు ప్రాంతాల్లో రాజధాని అన్న వ్యాఖ్య అనంతరం మరింత అయోమయం నెలకొందన్నారు. రాజధాని అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌతంరెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో విస్పష్ట ప్రకటన చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పై ఉందన్నారు. రాజధాని విషయంలో ప్రజలను అయోమయానికి గురిచేయడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవుపలికారు.

సంబంధిత వర్గం
గుండెపోటు వస్తే క్యాన్సర్ ఆస్పత్రికి ఎందుకు తీసుకె ...
గుండెపోటు వస్తే క్యాన్సర్ ఆస్పత్రికి ఎందుకు తీసుకె ...
రాజధాని మారుస్తామని అనలేదు - బొత్స
రాజధాని మారుస్తామని అనలేదు - బొత్స

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.