(Local) Sat, 06 Jun, 2020

టి హబ్ -2తో వేల మంది యువతకు ఉపాధి -కేటీఆర్

September 16, 2019,   2:20 PM IST
Share on:
టి హబ్ -2తో వేల మంది యువతకు ఉపాధి -కేటీఆర్

టి హబ్ -2తో సుమారు నాలుగు వేల మంది యువతకు ఉపాధి లభిస్తోందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. సోమవారం ఉదయం నాల్గో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎంఎల్ఎలు బాల్క సుమన్, వివేక్ అడిగిన ప్రశ్నలకు కెటిఆర్ సమాధానం ఇచ్చారు. టి హబ్ దేశంలోనే విజయవంతమైన ఇంక్యుబేటర్ అని ఆయన పేర్కొన్నారు. రాయదుర్గంలో రూ.276 కోట్లతో మూడు ఎకరాల్లో టి హబ్-2ను ఏర్పాటు చేస్తున్నట్టు కెటిఆర్ వెల్లడించారు. గోవా, ఢిల్లీ, అసోం తదితర రాష్ట్రాలకు టెక్నాలజీ సాయం చేస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి కలిపించేందుకు పలు ఆవిష్కరణలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఐటిని రాష్ట్రంలోని ఇతర నగరాలకు సైతం విస్తరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కలిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా సిఎం కెసిఆర్ నేతృత్వంలో ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.