(Local) Sat, 19 Oct, 2019

హుజూర్‌నగర్ ఉప-ఎన్నికకు.. నామినేషన్లు షురూ

September 23, 2019,   3:41 PM IST
Share on:
హుజూర్‌నగర్ ఉప-ఎన్నికకు.. నామినేషన్లు షురూ

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువునిచ్చింది. హుజూర్‌నగర్ ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. నామిషన్ల ప్రక్రియ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థి వెంట 4గురిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు కసర్తత్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డికి మరోసారి సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడంతో ఆయన నామిషన్ వేసేందుకు సిద్ధమౌతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బీజేపీ కూడా ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. 

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 7వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.ఈసారి ఎన్నికల్లో హుజూర్ నగర్‌లో పాగా వేస్తామని టీఆర్ఎస్ శ్రేణులు ధీమాగా చెబుతున్నారు. మరోవైపు అక్టోబర్‌ 21న పోలింగ్‌ నిర్వహించి.. 24వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈసీ సిద్ధమౌతోంది.

సంబంధిత వర్గం
శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించిన మంత్రి
శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించిన మంత్రి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.