(Local) Sat, 19 Oct, 2019

లష్కరే కి సహకరిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్

September 10, 2019,   11:54 AM IST
Share on:
లష్కరే కి సహకరిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్

లష్కరే తాయిబా ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి వీరిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో వీరంతా సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని… జమ్మూ కశ్మీర్ లో పలు దాడులకు వ్యూహరచన చేశారని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. ఉగ్రవాదులకు అనుకూలంగా ఉన్న పోస్టర్లను గోడలపై అతికిస్తున్నారని చెప్పారు. స్థానికులపై దాడి చేయడం, వారిని హతమార్చడం వంటి కేసుల్లో కూడా వీరు నిందితులుగా ఉన్నారని తెలిపారు. సాజిద్ మిర్ అనే ఉగ్రవాది ఆదేశానుసారం వీరంతా పని చేస్తున్నారని వెల్లడించారు. నిందితుల నుంచి పోస్టర్లను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో ఒమర్ మిర్, ఇజాజ్ మిర్, తాసిఫ్ నాజర్, ఒమర్ అక్బర్, ఇంతియాజ్ నాజర్, షౌకత్ అహ్మద్ మిర్, డానిష్ హబీబ్ ఫైజన్ లతీఫ్ లు ఉన్నారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
త్వరలో దేశమంతా ఎన్‌ఆర్‌సీ! అమిత్ షా
త్వరలో దేశమంతా ఎన్‌ఆర్‌సీ! అమిత్ షా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.