(Local) Sun, 17 Oct, 2021

హీరాగ్రూప్ రూ. 300 కోట్ల విలువైన ఆస్తుల జప్తు

August 17, 2019,   2:34 PM IST
Share on:
హీరాగ్రూప్ రూ. 300 కోట్ల విలువైన ఆస్తుల జప్తు

అధిక వడ్డీల పేరిట దాదాపు పదివేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన హీరాగోల్డ్‌కు చెందిన రూ. 300 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టిన హీరాగ్రూప్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో హీరాగ్రూప్‌నకు చెందిన రూ.277.29 కోట్ల విలువైన స్థిరాస్తులను, బ్యాంకుల్లో ఉన్న బ్యాలెన్స్ రూ.22.69 కోట్లను అటాచ్ చేస్తున్నట్టు ఇడి తెలిపింది. స్థిర.చరాస్తులు వెరసి హీరాగోల్డ్ గ్రూప్ సంస్థకు చెందిన రూ.300 కోట్ల ఆస్తులను ఇడి జప్తు చేసింది. దేశవ్యాప్తంగా హీరాగోల్డ్‌కు సంబంధించి 96 చోట్ల సంస్థ స్థిరాస్తులు ఉన్నట్టు ఇడి గుర్తించింది. ఇందులో భారీ భవనాలు, ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, వ్యవసాయ భూములు ఈ జాబితాలో ఉన్నాయి.

హీరా గ్రూప్ పేరుతో నౌహీరా షేక్ ప్రజల వద్ద నుంచి అక్రమంగా రూ.5,600 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందని తమ దర్యాప్తులో తేలినట్లు ఇడి అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్ నియంత్రణ చట్టం 2002 కింద నౌహీరాపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.