(Local) Mon, 23 Sep, 2019

చైనాపై సుంకాలను మరింతగా పెంచనందుకు సారీ -ట్రంప్

August 26, 2019,   12:58 PM IST
Views: 104
Share on:
చైనాపై సుంకాలను మరింతగా పెంచనందుకు సారీ -ట్రంప్

వాణిజ్య విషయాలలో చైనాపై తన ఆగ్రహాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తం చేశారు. చైనాతో వాణిజ్య యుద్థానికి తాను చింతిస్తున్నట్లు చెప్పిన కొద్ది గంటలోనే ఆయన మాట మార్చారు. తాను సారీ చెప్పింది ట్రేడ్ వార్‌కు కాదని, చైనాపై సుంకాలను మరింతగా పెంచనందుకు అని తెలిపారు. జి 7 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ట్రంప్ తరఫున మహిళా అధికార ప్రతినిధి స్టెఫనీ గ్రిషమ్ విలేకరులతో మాట్లాడారు. చైనా గురించి ట్రంప్ ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసకున్నారని ఈ రిసార్ట్ వేదిక నుంచి వివరణ ఇచ్చారు. చైనాతో వాణిజ్య పోరు విషయంలో పునరాలోచన ఉందా? అనే ప్రశ్నకు ట్రంప్ చెప్పింది వేరు, ప్రచారం జరిగింది వేరని స్టెఫనీ తెలిపారు.

సంబంధిత వర్గం
జకీర్ నాయక్‌ ను అప్పగించమని మోడీ కోరలేదు - మలేసియా ...
జకీర్ నాయక్‌ ను అప్పగించమని మోడీ కోరలేదు - మలేసియా ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.