(Local) Mon, 27 Sep, 2021

వైద్యురాలు పై బీజేపీ ఎంఎల్‌ఎ అత్యాచారం

October 16, 2019,   1:17 PM IST
Share on:
వైద్యురాలు పై బీజేపీ ఎంఎల్‌ఎ అత్యాచారం

అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ వైద్యురాలు తనపై బిజెపి ఎంఎల్‌ఎ అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సదరు ఎంఎల్‌ఎపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిమాంగ్ నియోజక వర్గంలో గోరుక్ పొర్దుంగ్ గత అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తరఫున ఎంఎల్‌ఎగా గెలిచాడు. బిమాంగ్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్‌గా ఓ వైద్యురాలు పని చేస్తోంది. అక్టోబర్ 12న వైద్యురాలుకు బిజెపి ఎంఎల్‌ఎ గోరుక్ ఫోన్ చేసి మీటింగ్ ఉందని హోటల్‌కు రమ్మని కబురుపంపారు. దీంతో ఆమె హోటల్‌కు వెళ్లగానే తాను బుక్ చేసిన రూమ్‌లోకి తీసుకెళ్లారు. అనంతరం ఆమెను మద్యం సేవించాలని బలవంతం పెట్టాడు. దీంతో ప్రతిఘటించడంతో ఆమెపై సదరు ఎంఎల్‌ఎ అత్యాచారం చేశారు. దీంతో స్థానిక ఎస్‌పి తమ్మె అమోకు వైద్యురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనని రాజకీయంగా అణగదొక్కడానికే సదరు మహిళ చేత ప్రతిపక్షనాయకులు ఆరోపణలు చేయిస్తున్నారని గోరుక్ మండిపడ్డారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.