(Local) Sun, 20 Sep, 2020

ఇతర పార్టీల హడావుడి పట్టించుకోవద్దు - కేటీఆర్

August 29, 2019,   12:33 PM IST
Share on:
ఇతర పార్టీల హడావుడి పట్టించుకోవద్దు - కేటీఆర్

తెలంగాణ ప్రజలు మొత్తం టీఆర్ఎస్ వైపే ఉన్నారని, ఇతర పార్టీలు ఎంత హడావుడి చేసినా పట్టించుకోవద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. దాదాపు 5గంటలకు పైగా సాగిన సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో మున్సిపాలిటీ వారీగా టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల బలాబలాలను కేటీఆర్ ఆరా తీశారు. వారి సత్తా ఎంత అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్ విజయం ఏకపక్షమేనని కేటీఆర్ అన్నారు.

సంబంధిత వర్గం
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన  కేటీఆర ...
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.