(Local) Tue, 22 Sep, 2020

 కర్నాటక బిజెపిలో అసమ్మతి చిచ్చు

August 20, 2019,   2:49 PM IST
Share on:
 కర్నాటక బిజెపిలో అసమ్మతి చిచ్చు

యడ్యూరప్ప మంత్రివర్గంలోకి కొత్తగా 17 మందిని చేర్చుకోవడంతో మంత్రి పదవులు దక్కని బిజెపి ఎమ్మెల్యేలు అస్సమతి బాట పట్టారు . ఉమేశ్ కట్టి, మురుగేశ్ నిరాని, బాలచంద్ర జార్కిహోలి, రేణుకాచార్య, బసవరాజ్ పాటిల్ యత్నాల్ తదితర బిజెపి సీనియర్ ఎమ్మెల్యేలు కొత్త కేబినెట్ ప్రమాణస్వీకారానికి డుమ్మా కొట్టారు .తనకు మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం పట్ల చిత్రదుర్గ నుంచి నాలుగవ సారి గెలిచిన బిజెపి ఎమ్మెల్యే జిహెచ్ తిప్పా రెడ్డి బాధ పడ్డారు . తనతోపాటు మంత్రి పదవులు దక్కని భావసౌరుప్యంగల ఎమ్మెల్యేలంతా కలసి విధేయులు, సీనియర్ ఎమ్మెల్యేలకు జరిగిన అన్యాయంపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.

తిప్పారెడ్డి మద్దతుదారులు చిత్రదుర్గలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మరో బిజెపి ఎమ్మెల్యే ఎస్ అంగరకి  కూడా మంత్రిపదవి దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ప్రజాజీవితంలో నైతిక విలువలకు కట్టుబడి పనిచేస్తున్నానని, తనలాంటి వ్యక్తిని విస్మరించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

మంత్రి పదవులు దక్కనివారిలో ఉమేశ్ కట్టి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలవగా బసవరాజ్ పాటిల్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సీనియర్లకు కేబినెట్‌లో చోటు దక్కకపోవడం ప్రభుత్వ మనుగడపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంతేగాక కోస్టల్ కర్నాటక, హైదరాబాద్-కర్నాటక ప్రాంతంతోపాటు కొన్ని కులాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై కూడా కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.