(Local) Fri, 26 Feb, 2021

జమ్మూలో ఎస్ఎంఎస్ సేవల పునరుద్ధరణపై చర్చలు

November 07, 2019,   1:01 PM IST
Share on:
జమ్మూలో ఎస్ఎంఎస్ సేవల పునరుద్ధరణపై చర్చలు

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో  జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై చర్చించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ కూడా సమావేశంలో పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ లోయలో ఎస్ఎంఎస్ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం నిర్ణయించినట్లుగా సమాచారం. సెలక్టివ్ బేసిస్‌లో ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, కొన్ని ప్రైవేటు హోటల్స్‌లో బ్రాడ్‌బ్రాండ్ కనెక్షన్లు పునరుద్ధరించనుంది. అయితే, ప్రస్తుతానికి మాత్రం మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగనుంది. ప్రభుత్వ యంత్రాంగం, విద్యార్థులు, పర్యాటకులు, విజిటర్లకు ఉపయుక్తంగా ఉండేందుకు బ్రాండ్ బ్యాండ్ సర్వీసులను పునరుద్ధరించాలని అత్యున్నత స్థాయి సమావేశంలో  నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.