(Local) Tue, 02 Mar, 2021

బలం లేని ఫడ్నవీస్ ప్రభుత్వం నిలబడదు: శరద్ పవార్

November 25, 2019,   11:28 PM IST
Share on:
బలం లేని ఫడ్నవీస్ ప్రభుత్వం నిలబడదు: శరద్ పవార్

మెజార్టీ లేని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నిలబడదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వానికే పూర్తి  మెజార్టీ ఉందని స్పష్టం చేశారు. సోమవారం రాత్రి 7గంటలకు 162 మంది ఎమ్మెల్యేలతో బలం నిరూపించిన అనంతరం శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించబోం.. శివసేన కూటమికే తమ మద్దతు అంటూ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలో తొలిసారి బలం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు అయ్యిందన్నారు. పొత్తులపై నిర్ణయం తీసుకునే అధికారం అజిత్ పవార్ కు లేదన్నారు. కర్ణాటక, గోవా, మణిపూర్ లో మెజార్టీ లేకున్నా ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని బీజేపీపై మండిపడ్డారు. ఇది గోవా కాదు.. మహారాష్ట్ర అని తెలుసుకోవాలని బీజేపీని హెచ్చరించారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.