(Local) Sat, 23 Oct, 2021

నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తి...... కుదేలైన ఆర్థిక వ్యవస్థ

November 08, 2019,   7:47 PM IST
Share on:
నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తి...... కుదేలైన ఆర్థిక ...

పెద్ద నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా దేశవాసులు నాటి కష్టాలను మరోసారి తలచుకున్నారు. గంటల తరబడి కిలోమీటర్ల దూరం వరకూ క్యూ లైన్లలో నిల్చున్న ఆ వైనాన్ని గుర్తు తలచుకొని కళ్లు చెమర్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్ష నేతలు, ప్రజాసంఘాలు, వ్యాపార వాణిజ్యవర్గాలు, చిరు వ్యాపారులు, సాధారణ ప్రజలు విమర్శల వర్షం కురిపించారు. ప్రజలు డబ్బులను బ్యాంకుల్లో దాచేందుకు ముందుకు రావడం లేదు. నోట్ల రద్దు వల్ల ప్రజలు పడిన ఇబ్బందులతో బ్యాంకులను కూడా నమ్మడం లేదు. వెరసీ ప్రజలు బ్యాంకుల్లో డబ్బులను దాచుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో చాలా బ్యాంకులు మూతపడ్డాయి. అంతేకాకుండా కేంద్రప్రభుత్వం బ్యాంకులను విలీనం చేసింది. ఏడాదిన్నర క్రితం స్టేట్ బ్యాంకు గ్రూపు బ్యాంకులన్ని విలీనం చేసింది. కేవలం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గొడుగు కిందకు తీసుకొచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే ఆంధ్రాబ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, సిండికేటు తదితర బ్యాంకులను విలీనం చేసింది. దీన్నిబట్టి బ్యాంకుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తుంది. దీంతో  దేశంలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతిన్నది. దేశ వృద్ధి రేటు 3శాతానికి దిగజారింది.  

పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ 2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న  విషయం తెలిసిందే. ఈ సంచలనం జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు నల్లధాన్ని రూపుమాపడం, అవినీతిని అరికట్టేందుకు నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామంటూ మోదీ నాడు ప్రకటించారు. వివిధ రంగాలపై దీని ప్రభావం నేటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై పలువురు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో ఒక్కరోజులోనే చలామణిలో ఉన్న 86శాతం నగదు చెల్లుబాటు కాకుండా పోయింది. రూ.15.44లక్షల కోట్ల విలువ చేసే రూ.500, రూ.1000ల నోట్లు రద్దయ్యాయి. 
నోట్ల రద్దు ప్రక్రియ గతంలో కూడా జరిగింది. కానీ రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. దేశంలో తొలిసారి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదికి 1948 సంవత్సరంలో నోట్ల రద్దు చేశారు. అప్పుడు రూ.10,000, రూ.5000ల నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాని తర్వాత 1976లో కూడా నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. కానీ మోడీలాగా ఏదో భూకంపం వచ్చినట్లు ప్రకటన చేయలేదు. రాత్రికి రాత్రి కరెన్సీని చెల్లుబాటు కాకుండా అప్పటి ప్రభుత్వాలు చేయలేదు. రోటిన్ లో భాగంగానే నోట్ల రద్దు ప్రక్రియను చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నది. దీనివల్ల ప్రజలు యధావిధిగా కార్యకలపాలను నిర్వర్తించారు. కానీ 2016లో మోడీ చేపట్టిన నోట్ల రద్దు ప్రక్రియ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రమాదంలో పడింది. 
రద్దు పై లోకల్ సర్క్యూట్ సంస్థ ఆన్ లైన్ సర్వే
మూడేళ్లు పూర్తయిన సందర్భంగా లోకల్ సర్క్యూట్ అనే సంస్థ ఆన్ లైన్ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో 58శాతం మంది నోట్ల రద్దును వ్యతిరేకించారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తి దెబ్బతిన్నదని పేర్కొన్నారు. దేశాాభివృద్ధికి పూర్తిగా ఆటంకంగా మారిందని తేలింది. బీజేపీ పార్టీకి చెందిన వారు మాత్రమే నోట్ల రద్దును స్వాగతించారు. దేశంలో చిరు వ్యాపారులను పూర్తిగా దెబ్బతీసింది. దీనివల్ల ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారని మండిపడ్డారు.నోట్ల రద్దు మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యమన, నోట్ల రద్దు తీవ్రవాద దాడిగా ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  అభివర్ఱించారు. నోట్ల రద్దు వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ కూడా నోట్ల రద్దుపై విరుచుకుపడ్డారు. దేశంలోని అన్ని సమస్యలకు నోట్ల రద్దే ప్రధాన కారణమని అన్నారు.  చిరు వ్యాపారులను చిద్రం చేసిందని విమర్శించారు.  మోదీ భజనపరులకు నోట్ల రద్దు నచ్చిందని తెలిపారు.నోట్ల రద్దు ఒక వృధా చర్యగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. ఒక్క ప్రకటనతో చాలా మంది భవిష్యత్, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు, సామాన్య ప్రజలు కూడా తప్పుపడుతున్నారని తెలిపారు.
నెటిజన్ల కామెంట్లు:
నోట్ల రద్దు జరిగి 3ఏళ్లు పూర్తయిన సందర్భంగా నెటిజన్లు విచిత్రంగా కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లు….. ‘సిద్ధంగా ఉండండి.. మేరే ప్యారే దేశ్ వాసియోం.. అంటూ ఆయన మళ్లీ మొదలుపెట్టొచ్చు..’ అని మరో నెటిజన్ ఎద్దేవా చేశారు. మోదీ ఫూల్ డే, బ్లాక్ డే.. అంటూ మరికొంత మంది విమర్శలు కురిపించారు. అదో పెద్ద స్కాం అంటూ మరికొంత మంది ఆరోపించారు.ఎలుకల నిర్మూలన కోసం ఇళ్లు తగులబెట్టుకున్నట్లుగా నోట్ల రద్దు ఉందని మరో నెటిజన్ విమర్శించారు. ఇలాంటి పని చేసిన వారిని ఏమనాలంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు సమయంలో సామాన్యుల బాధలు, కన్నీటి వ్యథలకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ మరికొంత మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ నోట్ల రద్దు ప్రక్రియతో దేశంలోని అన్ని వర్గాలు తీవ్రంగా నష్ట పోయారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.