(Local) Fri, 23 Jul, 2021

పార్కింగ్ స్థలంపై న్యాయవాదులతో పోలీసుల ఘర్షణ

November 06, 2019,   12:40 PM IST
Share on:
పార్కింగ్ స్థలంపై న్యాయవాదులతో పోలీసుల ఘర్షణ

ఢిల్లీలో లాయర్లు, పోలీసులకు తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీస్తుంది. మంగళవారం ఉదయం ఢిల్లీలో  పోలీసులు, అధికారులు కలిసి పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. శనివారం తీజ్ హజారి కోర్టు, సోమవారం సాకేత్ కోర్టులో జరిగిన ఘర్షణ కారణంగానే నిరసన ప్రదర్శన చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రోజు తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో పార్కింగ్ విషయంలో లాయర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారని న్యాయవాదులు ఆరోపించారు. అటు పోలీస్ విభాగానికి చెందిన వాహనాలకు దుండగులు నిప్పంటించారు. ఈ ఘర్షణల్లో ఓ లాయర్ గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే సాకేత్ కోర్టులో ఓ పోలీస్ పై పలువురు లాయర్లు దాడికి పాల్పడ్డారు. ఘర్షణకు పోలీసుల తీరే కారణమంటూ లాయర్లు సోమవారం నిరసన చేపట్టారు. లాయర్ల వల్లే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఘర్షణ తీవ్రం కావడంతోనే ముందు జాగ్రత్తగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.