(Local) Mon, 12 Apr, 2021

ఢిల్లీలో హైఅలర్ట్

October 03, 2019,   4:25 PM IST
Share on:
ఢిల్లీలో హైఅలర్ట్

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. జైషే మహ్మద్ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడినట్టు నిఘా వర్గాలు నిర్ధారించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నలుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో ఢిల్లీలోకి ప్రవేశించారని, ఢిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. జన సమ్మర్థం ఉన్న చోట దాడులకు ఈ నలుగురు ఉగ్రవాదులు కుట్ర చేశారని నిఘా వర్గాలు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశాయి. జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ ఉగ్రవాదులు దేశంలో దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద ప్రభావిత నగరాలతో పాటు పెద్ద నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.