(Local) Fri, 22 Oct, 2021

రేపు కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక

August 09, 2019,   9:38 PM IST
Share on:
రేపు కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక

దేశరాజధానిలో శనివారం నాడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే అధ్యక్ష ఎన్నిక జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీకి నూతన అధ్యక్షుడిని తప్పకుండా ఎన్నుకుంటామని, ఇక ఆలస్యమయ్యే అవకాశమే లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ నేడు మీడియాతో అన్నారు. అయితే రేపు జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో తాత్కాలిక చీఫ్‌ను ఎన్నుకుని, కొత్త అధ్యక్షుడి ఎంపికకు ప్యానెల్‌ను ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎంపిక ఆలస్యమైతే అది పార్టీకి నష్టం కలిగిస్తుందని కొందరు కాంగ్రెస్ వ్యక్తులు బహిరంగంగానే అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పార్టీ వేగవంతం చేసింది. 

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.