(Local) Mon, 26 Aug, 2019

చింతమడక గ్రామానికి అందజేస్తున్న సంక్షేమ పథకాలను మాకు ఇవ్వాలి....

August 10, 2019,   6:45 PM IST
Share on:

చింతమడక గ్రామానికి అందజేస్తున్న సంక్షేమ పథకాలను నంగునూరు మండలంలోని అన్ని గ్రామాలకు వర్తింప చెయ్యలని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర టి పి సి సి కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ఆధ్వర్యంలో మూడు రోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దేవులపల్లి యాదగిరి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి సొంత గ్రామమైన  చింతమడకలో ప్రకటించిన సంక్షేమ పథకాలు అన్నింటిని నంగునూరు  మండలంలోని అన్ని గ్రామ ప్రజలకు చెందాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తానంటే మేము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు . రాష్ట్రము మొతం  చింతమడకలాగా ప్రతి  కుటుంబానికి పదిలక్షలు ఇయ్యాలని డిమండ్ చేశారు. లేదంటే ఊరుకునే  ప్రసక్తే  లేదని  తెలిపారు నీ స్వార్థం కోసం రాష్ట్ర ప్రజా ధనాన్ని  నీ ఉరికి  దోచిపెడతావా అని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి గారు మండిపడ్డారు. సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం గారు ఈ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంగునూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుంటిపల్లి శ్రీనివాస్ గారు నంగునూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చెలికాని యాదగిరి రాంపూర్ కాంగ్రెస్ ఎం పి టి సి ఎనగందుల నితిన్ కుమార్ పూసల నరేందర్  శ్రీను తప్పేట శంకర్ వేణు శ్రీకాంత్ రామలింగం  సాదుల పవన్ రాజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వర్గం

అమిత్ షా సమావేశానికి కేసీఆర్,మమతా గైర్హాజరు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.