(Local) Mon, 12 Apr, 2021

దుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జగన్

October 04, 2019,   11:16 PM IST
Share on:
దుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జగన్

విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఏపీ సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ రోజు సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన దుర్గమ్మను ఆయన సందర్శించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు మూలా నక్షత్రం సమయంలో సీఎం జగన్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.మూలా నక్షత్ర ఘడియల్లో అమ్మవారిని దర్శించుకున్న జగన్, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం జగన్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. సీఎం రాకతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అనంతరం జగన్‌ అక్కడ నుంచి తాడేపల్లిలోని స్వగృహానికి బయలుదేరి వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.