(Local) Sat, 07 Dec, 2019

మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్

November 14, 2019,   1:00 PM IST
Share on:
మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇంకా పాఠశాలలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు, వైఎస్సార్‌ కిశోర వికాసం సంబంధించి ప్రత్యేకంగా స్టాల్స్‌ను సీఎం పరిశీలించారు. కాగా వైఎస్సార్‌ ప్రభుత్వం మనబడి నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లను కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో సర్కారీ బడులలో పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడవద్దని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అయితే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సర్కారీ బడులకు భారీ ఎత్తున బడ్జెట్‌ కేటాయించిన ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కావడం విశేషం.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.