(Local) Sat, 24 Jul, 2021

వలస కార్మికులకు సీఎం ఆర్ధిక సాయం

November 07, 2019,   12:54 PM IST
Share on:
వలస కార్మికులకు సీఎం ఆర్ధిక సాయం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో అక్టోబర్ 29న పశ్చిమబెంగాల్ వలస కార్మికులు ఐదుగురుని ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీంతో తమ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులందర్నీ వెనక్కి రప్పించేందుకు బెంగాల్ సర్కార్ చొరవ తీసుకుంది. దీంతో 138 వలస కార్మికులు కోల్‌కతా చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వరాష్ట్రానికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందని, తామంతా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నందున బతుకుతెరువు కోసం ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించాలని కోరారు. అలా జరగని పక్షంలో తిరిగి కశ్మీర్‌కో, ముంబైకో వలస వెళ్లక తప్పదన్నారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పొట్టకూటి కోసం కశ్మీర్ వెళ్లి ఉగ్రవాదుల ఘాతుకం తర్వాత పశ్చిమబెంగాల్ తిరిగివచ్చిన 138 మంది వలస కార్మికులకు చల్లటి కబురు చెప్పారు. వారంతా కొత్త జీవితం ప్రారంభించేందుకు వీలుగా ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. 

You have an error in your SQL syntax; check the manual that corresponds to your MySQL server version for the right syntax to use near 'Kolkatanews|Kolkatalatestnews|Kolkatanewslive|Kolkatanewstoday|TodaynewsKolkata|' at line 6
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.