(Local) Tue, 02 Jun, 2020

రోజా ఇంటికి సీఎం కేసీఆర్

August 12, 2019,   12:19 PM IST
Share on:
రోజా ఇంటికి సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు తమిళనాడులోని కంచికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన అత్తివరద రాజస్వామిని దర్శించుకోనున్నారు. కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకుంటారు. మార్గ మధ్యలో నగరిలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి చేరుకుంటారు.  ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం అక్కడే చేయనున్నారు. ఇందుకోసం రోజా ఇంట్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో కేసీఆర్ కుటుంబసభ్యులు తిరుమల వచ్చిన సందర్భంగా వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత వర్గం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.