(Local) Mon, 26 Aug, 2019

పంచాయతీరాజ్ బలోపేతంపై సిఎం కేసిఆర్ సమీక్ష

August 11, 2019,   5:43 PM IST
Share on:

పంచాయతీ రాజ్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సిఎం కేసిఆర్ శనివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు ఇప్పటి మాదిరిగా ఏ పనీ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామన్నారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలవడానికి ముందే స్థానిక  సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఇస్తామని వెల్లడించారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం వెలుగులో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి గ్రీన్ కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రా వు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ ఎస్.కె.జోషి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సిఎంఓ కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్, ఎంపి బండా ప్రకాశ్, ఎంఎల్‌ఎలు మర్రి జనార్థన్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎంఎల్‌సిలు శ్రీనివాసరెడ్డి, తేరా చిన్నపురెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, గట్టు రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వర్గం

అమిత్ షా సమావేశానికి కేసీఆర్,మమతా గైర్హాజరు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.