(Local) Wed, 18 Sep, 2019

త్వరలో సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటన

August 26, 2019,   12:32 PM IST
Views: 71
Share on:
త్వరలో సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటన

సిఎం కేసీఆర్  మహబూబ్‌నగర్‌ను కరువునుంచి పూర్తిగా తరిమివేసి జిల్లావ్యాప్తంగా జలవనరులతో సస్యశ్యామ లం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. త్వరలో పాలమూరు జిల్లాలో రెండురోజులపాటు పర్యటించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల బహుళార్థక సాధక ప్రాజెక్టు పనులవేగం పెంచి వచ్చే వర్షకాలంనాటికి పూర్తి చేయాలనే దృఢసంకల్పం తో సిఎం కేసీఆర్ ఉన్నారు. ఈమేర కు జలవనరుల అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్లను పరిశీలిస్తూ ఖరారు చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మ హబూబ్‌నగర్ జిల్లామంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన తేదీలను ఖరారుచేసి సీఎం కేసీఆర్ఆనుమతి తీసుకోనున్నా రు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జిల్లామంత్రులతో పాటు, నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమై పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న రిజర్వాయర్ల స్థలాలను పరిశీలించారు.

సంబంధిత వర్గం
అసెంబ్లీ లాబీలో హరీశ్ రావుతో కోమటిరెడ్డి రాజగోపాల్ ...
అసెంబ్లీ లాబీలో హరీశ్ రావుతో కోమటిరెడ్డి రాజగోపాల్ ...
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.