(Local) Tue, 27 Oct, 2020

సీఎం కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ సింగరేణి?

November 24, 2019,   10:11 AM IST
Share on:
సీఎం కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ సింగరేణి?

తెలంగాణ సీఎం కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ సింగరేణి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆర్టీసి పై సీఎం కేసీఆర్ తన నియంత పోకడను చూపిస్తున్నాడని..ఇక సింగరేణిని కూడా అలాగే పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారన్నారు. అయితే అందుకు ధీటుగా తెలంగాణలో బీజేపీ బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతుందని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో కూడా మహారాష్ట్రలో జరిగినట్టు రాజకీయ సర్జికల్ స్ట్రైక్ జరగనుందన్నారు. కేసీఆర్ ఆడిందే ఆట..పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారని అది మంచి పద్దతి కాదని లక్ష్మణ్ హితవు పలికారు. తెలంగాణలో ఆర్టీసి దివాలా తీయడానికి సర్కార్ తీరే కారణమని అన్నారు. బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని, అమిత్ షా తెలంగాణ నుంచి సభ్యత్వం తీసుకున్న విషయాన్ని మరిచిపోవద్దని టీఆర్ఎస్ నేతలకు లక్ష్మణ్ గుర్తు చేశారు. బీజేపీ బ్రహ్మాస్త్రాన్ని త్వరలోనే యావత్ తెలంగాణ సమాజం చూస్తుందని లక్ష్మణ్ అన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.