(Local) Mon, 23 Sep, 2019

వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ - కేసీఆర్

August 27, 2019,   2:28 PM IST
Views: 71
Share on:
వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ - కే ...

ఆర్థిక మాంద్యం ప్రభావం దేశ వ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. గత మార్చిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టినందున 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ ను త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు సిఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సీనియర్ అధికారులతో కలిసి సోమవారం ప్రగతి భవన్‌లో బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేశారు.

దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఉండడం వల్ల  దీని ప్రభావం  అన్ని రంగాలపై  పడింది. ఆదాయాలు బాగా తగ్గిపోయాయి. అన్ని రాష్ట్రాల్లో ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదాయం అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన జరగాలని సిఎం వ్యాఖ్యానించారు. వాస్తవ దృక్పథంతో బడ్జెట్ తయారు చేయాలన్నారు. ప్రజా సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులుండేలా చూడాలిచ అని చెప్పారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ఇతర ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వర్గం
సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ స ...
సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ స ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.